Site icon NTV Telugu

Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..

Sanjay Rout

Sanjay Rout

Sanjay Raut: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నాలుగు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్నటికి ప్రభుత్వ గడువు ముగిసినప్పటికీ కొత్త సర్కార్ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్ర సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు.

Read Also: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. కనిపిస్తే కాల్చివేతకు పాక్ సర్కార్ ఆదేశాలు

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ మెజారిటీతో విజయం సాధించింది.. కానీ, నవంబర్ 26 నాటికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలేకపోయిందని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సీఎంని కూడా నిర్ణయించలేదని విమర్శించారు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా సర్కార్ ఏర్పాటు చేయకపోతే ప్రెసిడెంట్ పాలన విధించాలన్నారు. ఇక, మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీకి 41 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం నాడు రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకూ ఆపద్ధర్మంగా షిండే కొనసాగాలని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ కోరారు.

Exit mobile version