Site icon NTV Telugu

Sanjay Raut: ముఖ్యమంత్రి కొడుకు నుంచి నాకు ప్రాణహాని.. రక్షణ కల్పించండి..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut Claims Threat To Life: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే(ఏక్ నాథ్ షిండే కుమారుడు) నన్ను చంపేందుకు థానేకు చెందిన నేరస్థుడు రాజా ఠాకూర్‌కు సుపారీ ఇచ్చాడని..బాధ్యత కలిగిన పౌరుడిగా మీకు తెలియజేస్తున్నా అని పోలీసులకు లేఖ రాశారు. అయితే సంజయ్ రౌత్ ఆరోపనలను అధికార పార్టీ తోసిపుచ్చింది. ఇది చౌకబారు స్టంట్ గా అభివర్ణించింది.

దీనిపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సంజయ్ రౌత్ కు ఆలోచనలు లేని ఆరోపణలు చేసే అవకాశం ఉందని, అయితే సంబంధిత అధికారులను సమీక్షించమని కోరతా అని ఆయన అన్నారు. సంజయ్ రౌత్ ముంబై కమిషనర్ తో పాటు హోంశాఖను నిర్వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు, థానే పోలీసులకు లేఖలు రాశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ఉద్దవ్ ఠాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కోరారు.

Read Also: Earthquake: త్వరలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ భూకంపాలకు అవకాశం..

ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సాత్ మాట్లాడుతూ.. సానుభూతి పొందేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాంత్ షిండే ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయరని అన్నారు. ఈ లేఖపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. సంజయ్ రౌత్ ఆరోపణలను బుద్ది లేని ఆరోపణలుగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారని, దాని వల్ల తనకు కాస్త సానుభూతి వస్తుందని అనుకోవచ్చని ఎద్దేవా చేశారు.

ఇటీవల శివసేన పార్టీని దాని ఎన్నిలక చిహ్నం ‘విల్లు-బాణం’ని ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో రూ.2000 కోట్ల లావాదేవీలు సాగాయని ఆరోపించారు సంజయ్ రౌత్. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీలకు రూ. 100 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.

Exit mobile version