Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
- రెబల్ ఎంపీలపై వరుసగా రెండో రోజు కూడా సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు.
- శివసేన తాజా చీలికకు సుప్రీంకోర్టే కారణమని ఆరోపణ.
- పార్లమెంటరీ సమావేశానికి 9 మందిలో కేవలం ముగ్గురు ఎంపీల హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)లో మరోసారి తిరుగుబాటు చెలరేగింది. 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమక్షంలోనే తిరుగుబాటు ఎంపీలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గురువారం కూడా సంజయ్ రౌత్ మరోసారి ఎంపీలపై దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు ముడిపెట్టారు.
న్యూఢిల్లీలో మీడియాతో తిరుగుబాటు ఎంపీలకు కల్పించిన భద్రత గురించి మాట్లాడుతూ.. వాళ్లు పిరికి వెధవలు అని అన్నారు. ఇప్పుడు ఆ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో స్వేచ్చగా తిరగాలని సవాల్ విసిరారు. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు అతిపెద్ద దోషి అని నిందించారు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9 మంది ఎంపీల్లో కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. విప్ ఉల్లంఘించాలరని వీరిపై చర్యలు తీసుకునేందుకు శివసేన యూబీటీ సిద్ధమవుతోంది. బీజేపీ దేశ రాజకీయాలను, ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిందని, దీనికి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సంజయ్ రౌత్ హెచ్చరించారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!