ప్రధాని మోడీకి “సంయుక్త కిసాన్ మోర్చా” లేఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని కోట్లాది మంది రైతులకు నవంబర్ 19 వ తేదీ ఉదయం దేశానికి మీ సందేశాన్ని వినిపించారు. మొత్తం 11 సార్లు చర్చలు జరిపిన తర్వాత ద్వైపాక్షిక పరిష్కారం కాకుండా ఏకపక్ష ప్రకటన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, మీరు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా మీ ప్రభుత్వం ఈ హామీని నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం,” అని లేఖలో పేర్కొన్నారు “ఎస్‌కెఎం”. రైతు ఉద్యమం లక్ష్యం, డిమాండ్ “కేవలం మూడు నల్ల చట్టాలను రద్దు చేయడమే కాదని” మీకు బాగా తెలుసు. ప్రభుత్వంతో చర్చల ప్రారంభం నుంచి కూడా “సంయుక్త కిసాన్ మోర్చా” మరో మూడు డిమాండ్లను చేసింది” అని లేఖలో పేర్కొంది “ఎస్‌కెఎం”.
“ఎస్‌కెఎం” అదనంగా పునరుద్ఘాటించిన మూడు అంశాలు
Also Read
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- “మొత్తం సాగు ఖర్చు (సి2+50 శాతం) ఆధారంగా “కనీస మద్దతు ధర” ను అన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రైతులందరికీ చట్టబద్ధమైన హక్కును కల్పించాలి.
• తద్వారా దేశంలోని ప్రతి రైతు కు “కనీస మద్దతు ధర” తప్పనిసరిగా లభించే భరోసా ప్రభుత్వం కల్పించాలి. (మీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ సిఫార్సును 2011లో అప్పటి ప్రధానికి అందించింది. ఆ మేరకు, మీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన కూడా చేసింది).
- “ప్రభుత్వం ప్రతిపాదించిన “విద్యుత్ చట్టం సవరణ బిల్లు-2020, 2021″ ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతులకు ప్రభుత్వానికి జరిగిన చర్చల సమయంలో దానిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దానిని ధిక్కరిస్తూ పార్లమెంటు ఎజెండాలో చేర్చింది”.
- “క్యాపిటల్ రీజియన్, అనుబంధ ప్రాంతాల్లో “కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటి మేనేజ్‌మెంట్ యాక్ట్- 2021” లో రైతులకు శిక్ష విధించే నిబంధనలను తొలగించాలి. ఈ ఏడాది ప్రభుత్వం కొన్ని రైతు వ్యతిరేక నిబంధనలను తొలగించింది. కానీ మరలా సెక్షన్ 15 ద్వారా రైతులకు శిక్ష విధించే నిబంధనను చేర్చింది”.
• “మీ ప్రసంగంలో రైతులు చేసిన ఈ మూడు ప్రధాన డిమాండ్లపై ఖచ్చితమైన ప్రకటన లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ చారిత్రాత్మక ఉద్యమం ద్వారా మూడు చట్టాల రద్దు మాత్రమే కాకుండా, కష్టపడి పండించిన పంటకు లాభదాయకమైన ధర లభిస్తుందనే హామీ ఇస్తారని రైతులు ఆశించారు”.
చారిత్రాత్మక ఉద్యమం కొనసాగుతున్న క్రమంలోనే మరికొన్ని సమస్యలను కూడా
పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు” లేఖలో ప్రస్తావించింది “ఎస్‌కెఎం”.
• రైతు ఉద్యమంలో (జూన్ 2020 నుండి ఇప్పటి వరకు) ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది కేసులు పెట్టారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
• లఖింపూర్ ఖేరీ హత్యకేసు సూత్రధారి, సెక్షన్ 120బిలో నిందితుడైన అజయ్ మిశ్రా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతూ మీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. మీతో పాటు ఇతర సీనియర్ మంత్రులతో కూడా వేదిక పంచుకుంటున్నారు. అతన్ని బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి.
• రైతు ఉద్యమంలో ఇప్పటివరకు సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పించే వ్యవస్థ ఉండాలి. అమరవీరులైన రైతుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించేందుకు సింఘూ సరిహద్దులో భూమి ఇవ్వాలి.
“మీరు రైతులు ఇంటికి తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వీధుల్లో రోడ్లపై కూర్చోవడం మాకు కూడా ఇష్టం లేదు. మేము మీకు హామీ ఇస్తున్నాం. ఈ ఆరు అంశాలను, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించిన తర్వాత, సత్వరమే మేము మా ఇళ్లకి, కుటుంబాలకు, వ్యవసాయం చేసుకునేందుకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కావాలని కోరుకుంటున్నట్లయుతే, పైన పేర్కొన్న ఆరు అంశాలపై ప్రభుత్వం వెంటనే “ఎస్‌కెఎం”తో చర్చలు పునఃప్రారంభించాలి. అప్పటి వరకు “ఎస్‌కెఎం” ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది” అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొంది “ఎస్‌కెఎం”.
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?