GOAT: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానంటున్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Venkat Prabhu about GOAT and Rajadurai Comparisions: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరిగిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో హిట్ చేశారు. అయితే గోట్ సినిమా మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా విజయ్ కాంత్ హీరోగా నటించిన రాజదురై అనే సినిమాకి దగ్గరగా ఉందని ఒకరకంగా దాని నుంచే సినిమా కాపీ కొట్టారని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయం మీద ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించాడు. తనకు విజయకాంత్ హీరోగా నటించిన రాజదురై సినిమా కథ తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు.
Akhil Akkineni: సరికొత్త ‘అయ్యగారు’ లోడింగ్!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
గోట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు విజయ్ కాంత్ రాజుదురై కథ ఏంటో తనకు తెలియదని ఒకవేళ తనకు ఇలాంటి సినిమా ఒకటి ఉందని తెలిసి ఉంటే కచ్చితంగా దాన్ని చూసి తర్వాత ఎలాంటి పోలికలు లేకుండా గోట్ ఇంకా బెటర్ గా తీసి ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిజానికి ఆయన చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఈ రాజ దురై సినిమాని విజయ్ తండ్రి ఎస్సీ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారట. విజయ్ తండ్రి డైరెక్ట్ చేసిన సినిమా అంటే విజయ్ చూడకుండా ఉండరు. ఆ సినిమా కథ ఆయనకు తెలియకుండా ఉండదు. అలాంటి కథతోనే మరో సినిమా చేస్తున్నారని బహుశా ముందే వెంకట్ ప్రభుతో చర్చించి ఉండవచ్చని, అయినా సరే ఈ జనరేషన్ కి పెద్దగా ఆ సినిమా కథ తెలియదు కాబట్టి ముందుకు వెళదామని వెంకట్ ప్రభు ఆయనని ఒప్పించి ఉండవచ్చు అని అంటున్నారు. అంతా జరిగిపోయిన తర్వాత అసలు అలాంటి సినిమా ఒకటి ఉందని తనకు తెలియదు అనడం కామెడీగా ఉందంటూ తమిళ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!