Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
- అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్
- బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు. ‘‘దేశంలో మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్షంలో లేవనెత్తిన ప్రతి గొంతును అణచివేయాలని చూస్తోంది.’’ అని ఎక్స్‌లో ఫక్రుల్ హసన్ చాంద్ పేర్కొన్నారు. ఖాతా పునరుద్ధరించకపోతే పార్టీ చట్టపరంగా ముందుకెళ్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతాలో హింసాత్మక, లైంగిక కంటెంట్‌ను పోస్ట్ చేయడంపై ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచారం. అఖిలేష్‌కు ఫేస్‌బుక్‌లో 8 మిలియన్లకు పైగా అనుచరులుు ఉన్నారు. ఈ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హఠాత్తుగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఖాతా క్లోజ్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. దేశంలో మూడో అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ ఖాతాను క్లోజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీ ఇలా చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు. ఇది అధికార పార్టీ ఆదేశం మేరకు జరిగి ఉంటే పిరికితనానికి సంకేతం అన్నారు. సోషలిస్టుల గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం పొరపాటు అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలోని ఓ ప్లాంట్‌లో పేలుడు.. 19 మంది మృతి!
అయినా ఎటువంటి హెచ్చరికా.. నోటీసు లేకుండా ఫేస్‌బుక్ ఖాతాను ఎలా క్లోజ్ చేస్తుందని లక్నో నార్త్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా శుక్లా ధ్వజమెత్తారు. ఫేస్‌బుక్ తన పరిమితులను దాటడానికి ధైర్యం చేసిందని మండిపడ్డారు. ‘‘అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది గొంతుక! ఫేస్‌బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు. సమాజ్‌వాదీలారా.. ఫేస్‌బుక్‌ను దాని పరిధిని గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది! ఇటువంటి అహంకారాన్ని సహించబోము.’’ అని శుక్లా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!