Salman Khan: ఆ సింగర్‌ను చంపినట్టే.. నిన్నూ చంపేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో హెచ్చరించారు. అయితే, ఈ లేఖ ఎవరు రాశారన్నది తెలియాల్సి ఉంది. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సల్మాన్.. పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
కాగా.. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మాన్‌ను బహిరంగంగా చంపుతానంటూ లారెన్స్ బిష్ణోయ్ ప్రతిజ్ఞ చేశాడు. అందుకు కారణం.. సల్మాన్ కృష్ణజింకలను వధించినట్టు ఆరోపణలు రావడమే! కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటిని చంపాడని ఆరోపణలు వచ్చినప్పుడు, సల్మాన్‌పై నాడు బిష్ణోయ్ తెగవారు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా ఈ బిష్ణోయ్ తెగకు చెందినవాడే. ఈ నేపథ్యంలోనే.. సల్మాన్‌కు బెదిరింపు లేఖ వెనుక బిష్ణోయ్ ముఠా హస్తం ఉండొచని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఇదిలావుండగా.. ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ తన సహనటులతో కలిసి కృష్ణజింకల్ని వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్‌పై 9/51 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972తో పాటు ఆయుధాల చట్టంలోని 3/25, 3/27 సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. 2018లో జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించింది. అయితే, ఆ తర్వాత సల్మాన్ బెయిల్ మీద వచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!