కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో…