NTV Telugu Site icon

Salman Khan Threat Case: రూ. 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తాం.. పోలీసులకు మెసేజ్

Salman

Salman

Salman Khan Threat Case: ఎన్సీపీ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుంచి ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతపై అప్రమత్తంగా ఉన్నారు. ఆయన ఇల్లు, ఫామ్ హౌస్ దగ్గర భద్రతను భారీగా పెంచారు. సల్మాన్ ఇంటి బయట సెల్ఫీలు దిగుతున్న ఫ్యాన్స్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్‌కు ఓ షాకింగ్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌లో సల్మాన్‌ నుంచి 5 కోట్ల రూపాయలను డిమాండ్‌ చేస్తూ బెదిరింపు సందేశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Read Also: IND vs NZ: న్యూజిలాండ్‌తో సిరీస్‌.. హర్మన్‌ప్రీత్‌కే కెప్టెన్సీ! నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు

ఇక, ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్ లో సల్మాన్ ఖాన్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అలాగే, సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండి.. లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలంటే.. తమకు 5 కోట్లు చెల్లించాలని ఓ సందేశం గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చింది. అయితే, డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటుందని అందులో ప్రస్తావించారు. అదే సమయంలో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు

కాగా, అక్టోబర్ 12న రాత్రి సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మాజీమంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు. అయితే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిఖీ మరణానికి పూర్తి బాధ్యత వహిస్తుంది.. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. లారెన్స్ బిష్ణోణ్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు.

Show comments