Salaries of central government employees to increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 7వ పే కమిషన్ కింద ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ఉద్యోగ సంఘాలు ముసాయిదాను ప్రభుత్వానికి అందించాయి. ఒక వేళ కేంద్ర ఓకే చెబితే.. 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులు గత కొన్నాళ్ల నుంచి ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కోసం పోరాడుతున్నారు.
Read Also: Matrimony Fraud: మ్యాట్రిమోనీలో పరిచయం.. లక్షల్లో ప్యాకేజీ అని అత్యాచారం
కొన్ని రోజుల క్రితం కేంద్రప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ పొందుతున్నారు. తాజాగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే.. మరింత ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగుల కనీస వేతనంతో పాటు మొత్తం వేతనం పెరుతుంది.
ప్రస్తుతం ఉద్యోగులు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57శాతంగా ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్ల ప్రకారం ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంటే అది 3.48 శాతానికి పెరుగుతుంది. దీంతో కనీస వేతనం పెరుగుతుంది. ఇప్పుడు కనీసవేతనం రూ. 18,000 ఉంటే అది రూ. 26,000లకు చేరుకుంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000, గరిష్ట వేతనం రూ.56,900గా ఉంది. ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచితే.. అంతే స్థాయిలో అవెన్సులు కూడా పెరుగుతాయి.