Site icon NTV Telugu

Rajasthan: అశోక్‌ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ.. ఆనందంలో రాజస్థాన్ కాంగ్రెస్

Rajastan

Rajastan

Rajasthan: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ సమావేశం అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశంపై ఇద్దరు నేతలు ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్‌ పైలట్‌ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి మాజీ సీఎంను కలిశాను అని సచిన్ తెలపగా.. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను అశోక్ గెహ్లాట్ షేర్ చేశారు. రాజేశ్‌ పైలట్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read Also: Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..

అయితే, 1980లో రాజేశ్‌, తాను ఒకేసారి లోక్‌సభలో అడుగు పెట్టామన్నారు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. తమ మధ్య 18 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజేశ్‌ ఆకస్మిక మరణం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. మరోవైపు అశోక్‌- సచిన్‌ పైలెట్ మధ్య సయోధ్య కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజేశ్ పైలట్‌ వర్ధంతి కార్యక్రమంలో గెహ్లాట్ పాల్గొంటే.. అది రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాల్లో మంచి పరిణామమేనని ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.

Read Also: Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్

కాగా, 2018 నుంచి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్‌ల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది. 2020లో ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూ.. నాడు డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్‌ పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. దాదాపు నెల రోజుల పాటు ఈ రాజకీయ సంక్షోభం కొనసాగింది. ఆ తర్వాత వీరు ఇద్దరూ పరస్పర విమర్శలు సైతం చేసుకున్నారు. దీంతో ఈ గొడవ మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు వీరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు ట్రై చేసినప్పటికీ.. అది ఫలించలేదు.

Exit mobile version