శబరిమల ఆలయాన్ని ఈ నెల 17 వ తేది నుండి తెరవనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. దేవస్థానం ఐదు రోజులపాటు తెరిచి ఉంటుందని చెప్పారు.స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చేవారు ఖచ్చితంగా ఆర్ టీ పీసి ఆర్ రిపోర్ట్ ఉండలాని సూచించారు.
read also : వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలో కరోనా కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా ప్రతిరోజు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇది గడచిన 24 గంటల్లో కొత్తగా… 14,087 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి.