వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ తాజాగా మరికొందరి పేర్లు తెరపైకి తెచ్చింది. దీంతో కేసు దర్యాప్తు మరో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను పదే పదే విచారించిన అధికారులు.. తాజాగా వారితో పాటూ వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ ,ఉమా మహేశ్వర్ ను గత పది రోజులుగా ప్రశ్నిస్తోంది. వారి నుంచి కీలక ఆధారాలు సేకరిస్తోంది.

read also : గుడ్‌ న్యూస్‌… దేశంలో తగ్గిన కరోనా కేసులు

ఢిల్లీలో 50 రోజులుగా దస్తగిరిని ప్రశ్నించిన సీబీఐ బృందం.. కడపలో కూడా వరుసగా 10 రోజులు విచారణ చేయడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో తెరపైకి కొంతమంది వస్తూ ఉండటంతో కీలక సూత్రదారులెవరో అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వివేకాకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, ఆస్తుల వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన గంగిరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టే పనిలో పడ్డారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన రోజున గదిలో సాక్షాధారాలను ఎందుకు చెరిపేశారనే కోణంలో కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికీ గంగిరెడ్డిని సిట్ అధికారులు గుజరాత్ కు తీసుకెళ్లి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయించారు. ఎర్రగంగిరెడ్డితో పాటు డ్రైవర్ ప్రసాద్, సింహహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన వివేకా మాజీ పిఏ జగదీశ్వర్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డితో పాటు సుమారు వంద మందికి పైగానే కొత్త వ్యక్తులను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు ఆర్థిక లావాదేవీలు చూసుకునే వారు ఇలా ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా విచారిస్తున్నారు. 34 రోజులుగా సీబీఐ బృందం కడపలోనే ఉండి నిజాలు నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-