Site icon NTV Telugu

Putin- Modi Meeting: భారత పర్యటనకు రష్యా అధినేత.. పుతిన్ పర్యటనతో మరిన్ని ఒప్పందాలు?

Puthin

Puthin

Putin- Modi Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ టూర్ లో చమురు కొనుగోళ్లు, రక్షణ- వాణిజ్యం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. అలాగే, రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు విందును దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏర్పాటు చేయనున్నారు. అయితే, పుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Rohit Sharma: వరల్డ్‌ రికార్డ్‌ ముందు రోహిత్‌ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!

రక్షణ సహకారం
రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో రక్షణ, అణుశక్తి, హైడ్రోకార్బన్స్, అంతరిక్షం, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాలలో సహకారాన్ని భారత్- రష్యా సమీక్షిస్తాయి. ఎస్-500 రక్షణ వ్యవస్థతో సహా తదుపరి నెక్ట్స్ తరం వాయు రక్షణ వ్యవస్థలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలోపెతం కానున్నాయి. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడుల నుంచి భారతదేశానికి రక్షణ కల్పించడానికి రష్యాకు చెందిన ఎస్-400 వ్యవస్థ ఉపయోగపడింది. ఇక, సోవియట్ యూనియన్ పై దశాబ్దాలుగా భారతదేశం తన సైనిక అవసరాల కోసం ఎక్కువగా ఆధారపడింది.

Read Also: Rakul Preet Singh : MRI రిపోర్ట్‌ను జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్ళేదాని..

రక్షణ దిగుమతుల్లో తగ్గుదల
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తెలిపిన వివరాల ప్రకారం.. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 2010 వరకు భారతదేశ ప్రధాన సాంప్రదాయ ఆయుధాలలో 70 శాతం కంటే ఎక్కువ రష్యా నుంచే దిగుమతి అయ్యేవి. అయితే, 2014 తర్వాత ఈ వాటా తగ్గిపోయింది. కానీ, గత ఐదేళ్ల కాలంలో (2019-2023), రష్యా వాటా దాదాపు 36 శాతానికి పడిపోయింది. ఇది 60 ఏళ్లలో అత్యల్పంగా చెప్పాలి.. ఈ మార్పుకు కారణం భారతదేశం ఫ్రాన్స్- అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులను పెంచుకుంది.

Read Also: Jihad Controversy: జిహాద్ పుట్టడానికి కారణం ఇదే.. జమియత్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

రష్యా ఇప్పటికీ భారతదేశానికి కీలక భాగస్వామి..
అణు జలాంతర్గాములు, వాయు రక్షణ వ్యవస్థల వంటి ముఖ్యమైన ప్లాట్‌ఫారమ్‌లు, వీటిని అందించే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తదుపరి తరం క్షిపణి రక్షణ, హైపర్‌సోనిక్ వ్యవస్థలపై భారతదేశానికి ఉన్న ఆసక్తి కనబర్చడంతో ఇప్పటికే ఈ రంగాలలో రష్యా ముందుంది. అయితే, భారత్ యొక్క కొనుగోలు విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో విమానాలు ఆధిపత్యం వహించగా, ఇప్పుడు ఇండియా ప్రధానంగా వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, నౌకా ప్లాట్‌ఫారమ్‌లు, సాయుధ వాహనాలు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక బదిలీపై దృష్టి పెట్టింది.

ఉక్రెయిన్ తో యుద్ధం సమయంలో సరఫరాలో అంతరాయాల కారణంగా ఒకే దేశంపై అతిగా ఆధారపడకుండా, రష్యాతో పాటు పాశ్చాత్య, స్వదేశీ వ్యవస్థల మిశ్రమాన్ని భారతదేశం నిర్మిస్తోంది. అలాగే, ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన రక్షణ వస్తువుల వాటా పెరిగింది. AK-203 రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు వంటి అనేక రష్యన్-మూల ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పుడు స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నారు. రక్షణ పరంగా రష్యాపై ఆధారపడటం తగ్గినప్పటికీ, ఆర్థికంగా, ఇంధనంపై ఆధారపడటం బాగా పెరిగింది. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో, మాస్కో భారీ తగ్గింపులతో చమురును అందించడం ప్రారంభించింది. ప్రపంచంలో మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. దీంతో ముడి చమురు, ఎరువులు, కూరగాయల నూనెలు, బొగ్గు, లోహాలు వంటి వాటిని రష్యా నుంచి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అలాగే, మాస్కోకు భారతదేశం నుంచి యంత్రాలు, ఔషధాలు, విద్యుత్ పరికరాలు, మొదలైన ఎగుమతులు తక్కువగా ఉన్నాయి.

పుతిన్ పర్యటనలో ముఖ్యాంశాలు
వాయు రక్షణ ఒప్పందాలు: ఎస్-500 లేదా సంబంధిత వ్యవస్థలపై పురోగతి, క్షిపణి రక్షణ కోసం రష్యా- భారతదేశానికి ప్రధాన భాగస్వామిగా కొనసాగుతుంది.
సాంకేతిక బదిలీ: స్వయం-సమృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి, ముఖ్యంగా క్షిపణులు, జలాంతర్గాములు, విమానయానంలో, మరింత లోతైన ఉమ్మడి ఉత్పత్తి మరియు సహ-అభివృద్ధి కోసం భారతదేశం ఒత్తిడి చేయనుంది.
చమురు ధరలు, భవిష్యత్తు ఇంధన అవసరాలు: ప్రపంచ ధరలు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో, భారతదేశం ఊహించదగిన సరఫరా, దీర్ఘకాలిక ఒప్పందాలను సురక్షితం చేసుకోవాలని చూస్తుంది.

Exit mobile version