Ruchira Kamboj:యూఎన్వో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు మంగళవారం పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్.. ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భూటాన్‌కు భారత మొదటి మహిళా రాయబారిగా ఆమె నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని రుచిరా భర్తీ చేయనున్నారు.
1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్‌గా ఆమె నిలిచారు. అంతేకాకుండా 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్. 2002 నుంచి 2005 వరకు న్యూయార్క్‌లోని ఐరాస భారత శాశ్వత మిషన్‌లో ఆమె నియామకం పొందారు. పలు పదవుల్లో సేవలందించిన ఆమె.. ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు. ఇప్పటివరకు ఈ విధులు నిర్వహించిన టీఎస్ తిరుమూర్తి ఐక్యరాజ్యసమితిలో భారత గళాన్ని స్పష్టంగా వినిపించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో.. భారత్ వైఖరిని పలు దేశాలు తప్పుబట్టగా, ఆయా దేశాలకు ధీటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ విషయంలో తామేం చేస్తున్నామో తమకు తెలుసని, తమకు ఎవరూ సలహాల ఇవ్వాల్సిన అవసరం లేదని డచ్ రాయబారికి గట్టిగా సమాధానమిచ్చారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!