NTV Telugu Site icon

RSS Chief: పెరుగుతున్న మందిర్‌-మసీద్‌ వివాదాలు.. ఇది ఏమాత్రం మంచిది కాదు..!

Rss

Rss

RSS Chief: పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్‌ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ అధినేత మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మందిర్‌-మసీద్‌ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.

Read Also: Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!

కాగా, ప్రతి రోజూ కొత్త వివాదాలు తీయడంతో వీటిని ఎలా అంగీకరించమంటారని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. మనం అందరం కలిసిమెలిసి ఉంటాం అనేది ఈ ప్రపంచానికి చూపించాలన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం కొనసాగుతుంది.. దీంట్లో సర్కార్ ను నడిపే ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు కూడా పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నారు.. ఆధిపత్య భాష ఎందుకు?, ఎవరు మైనార్టీ?, ఎవరు మెజార్టీ? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే.. ఎవరి ఇష్టమైన దేవుడిని వారు కొలుస్తారని చెప్పుకొచ్చారు. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా ప్రతి ఒక్కరూ జీవించడం అవసరమని మోహన్ భగవత్‌ వెల్లడించారు.