Site icon NTV Telugu

Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి?.. నకిలీ పోస్ట్‌ను ఛేదించిన పోలీసులు

Sofia

Sofia

Colonel Sofiya Qureshi: భారత్- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మతపరమైన సమస్యలను సృష్టించాలనే లక్ష్యంతో సైబర్ దాడులకు దిగుతుంది దాయాది దేశం. తాజాగా, ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, కర్ణాటకలోని బెళగావిలో ఉన్న కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతుదారులు ధ్వంసం చేశారని అందులో పేర్కొంది.

Read Also: Shocking News: ప్రస్తుత ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడానికి కారణం ఇదే..!

ఇక, ఈ పోస్ట్‌ వైరల్ కావడంతో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు ఆ పోస్ట్ చేసిన ఎక్స్ ప్రొఫైల్ పేరు “అనిస్ ఉద్దీన్” అని ఉంది. ఆ లొకేషన్ బ్రిటిష్ కొలంబియా, కెనడా అని చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ 405 హ్యాండిల్స్, 31 మంది ఫాలోవర్లను కలిగి ఉందన్నారు. ఇందులో చాలా పోస్ట్‌లు పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నాయని గుర్తించారు. కవర్ ఇమేజ్‌లో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నా, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇతర ఉన్నత పాకిస్తాన్ రక్షణ అధికారుల ఫోటోలు దర్శనమిచ్చాయి.

Read Also: Pakistan Envoy: అమ్మాయితో పాక్‌ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు

కాగా, ఇండియన్ ఆర్మీ అధికారి కుటుంబంపై చేసిన ఈ పోస్టు కలకలం రేపుతుంది. భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి చేయలేదని కర్ణాటక పోలీసులు తేల్చి చెప్పారు. ఇది నకిలీ పోస్ట్.. ఇలాంటి వాటిని నమ్మొద్దని అన్నారు. ఈ పోస్ట్‌ను సృష్టించిన వారి కోసం గాలిస్తున్నాం.. వెంటనే దీన్ని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని బెళగావి ఎస్పీ హెచ్చరించారు. అయితే, కల్నల్ ఖురేషి గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. ఆమె బెళగావికి చెందిన కల్నల్ తాజుద్దీన్ బాగేవాడిని వివాహం చేసుకున్నారు. కల్నల్ ఖురేషి అత్తమామలు బెళగావిలో నివాసం ఉంటున్నారు.

Exit mobile version