8నెలల గర్భవతి అయిన వందన తన భర్త చంద్రేశ్ తో కలిసి కల్యాణ్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందన తన భర్త, కుమార్తెతో రైలు ఎక్కింది. ఇంతలోనే వారు ఎక్కాల్సిన రైలు కాదని తెలియడంతో దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైలు కదులుతుండడంతో వందన అదుపు తప్పి రైలుకు రైల్వే ఫ్లాట్ ఫాంకు మధ్య గల ఖాళీలో పడిపోయింది.
దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ ఖండేకర్ గమనించి వందనను ప్రమాదం నుంచి కాపాడాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించిన కానిస్టేబుల్ ఖండేకర్ ను అందరూ అభినందించారు. అనంతరం వందనను తన కుటుంబ సభ్యులతో వారు ఎక్కాల్సిన రైలు ఎక్కించి జాగ్రత్తగా పంపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ రైల్వే అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Railway Protection Force (RPF) staff Shri S R Khandekar saved the life of a pregnant woman who had slipped while attempting to de-board a moving train at Kalyan railway station today.
— Shivaji M Sutar (@ShivajiIRTS) October 18, 2021
Railway appeals to passengers not to board or de-board a running train.@RailMinIndia pic.twitter.com/68imlutPaY