NTV Telugu Site icon

Ramesh Bidhuri: “నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు”.. బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు..

Ramesh Bidhuri

Ramesh Bidhuri

Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్‌గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.

ఢిల్లీలోని కల్కాజీ నుంచి బిధూరి పోటీ చేస్తున్నారు. బీజేపీని “మహిళా వ్యతిరేక పార్టీ”గా అభివర్ణించిన కాంగ్రెస్, బిధూరి వ్యాఖ్యలు “సిగ్గుచేటు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు అతడి వికారమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. బీజేపీ అసలు రూపం ఇదే అని, పార్టీ అగ్రనాయకత్వం చేతులు జోడించి ప్రియాంకాగాంధీని క్షమించాలని కోరాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే అన్నారు.

Read Also: George Soros: జార్జ్ సోరోస్‌కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..

తాను ఈ వ్యాఖ్యలను చేశారని రమేష్ బిధూరి చెప్పారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమా మాలిని చెంల వలే స్మూత్‌గా మారుస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ ఈ రోజు కాంగ్రెస్ నా ప్రకటనతో బాధపడుతుంటే, హేమమాలిని విషయంలో ఏం వారు ఏం చేశారు..? ఆమె పేరు పొందిన ఒక కథానాయిక, సినిమాల ద్వారా భారతదేశానికి కీర్తి చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యల్ని వారు ప్రశ్నించకపోతే, నా వ్యాఖ్యల్ని ఎలా ప్రశ్నిస్తారు.?’’ అని అన్నారు. హేమమాలిని మహిళ కాదా..? ప్రియాంకా గాంధీ కన్నా ఆమె ఎక్కువ ఖ్యాతిని సాధించారు అని బిధూరి అన్నారు.

బిధూరి వ్యాఖ్యల్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఖండించారు. మహిళల పట్ల బీజేపీకి ఉన్న గౌరవం ఇది అంటూ ట్వీట్ చేశారు. బిధూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2023లో లోక్‌సభలో అప్పటి బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై తర్వాత బిధూరి విచారం వ్యక్తం చేశారు.

Show comments