Road Cracks Open After Water Pipeline Bursts In Maharashtra: మహారాష్ట్రలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఒక పైప్‌లైన్ బద్దలు కావడంతో.. రోడ్డు ముక్కలైంది. అదే సమయంలో ఆ దారిపై స్కూటీపై వెళ్లిన మహిళ.. ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యావత్మాల్ జిల్లాలోని విదర్భ హౌసింగ్ సొసైటీలో శనివారం నీటి ఒత్తిడికి అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ఒక్కసారిగా బద్దలైంది. దీంతో.. ఆ ప్రాంతంలోని రోడ్డు ముక్కలైంది. అచ్చం సినిమాలోలాగా.. రోడ్డు పెళ్లపెళ్లమంటూ ముక్కలవ్వడంతో, రహదారిపై నీళ్లు ఎగజిమ్మాయి. సరిగ్గా అదే టైంలో ఓ స్కూటీపై వెళ్తున్న మహిళపై ఓ భయంకరమైన అలలాగా నీళ్లు ఎగిసిపడటంతో, ఆమె కిందపడిపోయింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది కూడా! దీంతో వెంటనే స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకొని, ఆమెను కాపాడారు. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Man Elope With Son Wife: భర్తకు శఠగోపం.. మామతో కోడలు జంప్
ఈ ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి పూజా బిశ్వాస్ మాట్లాడుతూ.. ‘‘సరిగ్గా ఈ ఘటన జరగుతున్న సమయంలో నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను. పైప్‌లైన్ బద్దలవ్వడంతో, ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఆ రహదారికి అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. ఇదిలావుండగా.. 2020లోనూ ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆసుపత్రి సీలింగ్‌పై ఏర్పాటు చేసిన పైప్‌లైన్ బద్దలు కావడంతో.. కొవిడ్ వార్డు నీటిలో మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోనూ ఇటువంటి సంఘటనే మరొకటి వెలుగుచూసింది. ఇట్టమడు మెయిన్ రోడ్డులోని కొంత భాగం ముక్కలవ్వగా.. అటుగా వెళ్లిన సైక్లిస్ట్ గాయపడ్డాడు.
Medico Preeti Case: మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్యా?.. ఇంకా వీడని మిస్టరీ
#WATCH | Road cracked open after an underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured. pic.twitter.com/8tl86xgFhc
— ANI (@ANI) March 4, 2023