Actor Darshan: జైలులో దర్శన్‌కి వీఐపీ ట్రీట్మెంట్.. రేణుకాస్వామి తండ్రి ఆవేదన..
- జైలులో సిగరేట్ తాగుతున్న దర్శన్ ఫోటో వైరల్..
- వీఐపీ ట్రీట్మెంట్పై రేణుకాస్వామి తండ్రి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan: కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరేట్ పట్టుకుని తాగుతుండటం కనిపిస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతనితో పాటు కొంతమంది రౌడీషీటర్ ఖైదీలు కూడా కనిపిస్తారు. ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడ మరియు 15 మంది సహచరుల జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 28 వరకు పొడిగించింది.
Read Also: Eme Subbamma Idiye Eme Katha: ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’ సినిమా ప్రారంభం.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే, దర్శన్‌కి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం పట్ల రేణుకాస్వామి తండ్రి కాశీనాథ శివనగౌడర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాడు. ‘‘దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు, కోర్టు అందుకు అనుమతించలేదు. మాకు పోలీసులు, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యమేస్తోంది. ఇది నాకు షాకింగ్ న్యూస్. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని ఆయన కోరారు. దర్శన్‌పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
జూన్ నెలలో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఇరుక్కున్నాడు. దర్శన్, పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాక్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపాను. జూన్ 9న బెంగళూర్ లోని ఓ ప్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో అతను షాక్, రక్తస్రావం, అనేక గాయాల కారణంగా మరణించినట్లు తేలింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!