ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల రహస్యాలను తెలుసుకునేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని అంటున్నారని. గత 11 సంవత్సరాలుగా భారతీయుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. కేంద్రమంత్రి క్లారిటీ
సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పుడు రేణుకా చౌదరి కుక్కను తీసుకొచ్చి హల్‌చల్ చేశారు. అయితే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh-IAS Trainees: ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!
అయితే బీజేపీ ఎంపీల డిమాండ్‌పై రేణుకా చౌదరి మండిపడ్డారు. తన కుక్క ఏమి చేయదని.. ప్రమాదంలో ఉంటే రక్షించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కుక్కలు ఏమి చేయవు గానీ.. పార్లమెంట్ లోపల ఉన్న కుక్కలు మాత్రం కరుస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ ఆర్మీ ఆఫీసర్లపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Delhi: Congress MP Renuka Chowdhury says, "…The most frightening situation is that, for the first time, Army leaders are coming out and saying that they are being pressured to speak in support of the government…" pic.twitter.com/sV5o51DHwA
— IANS (@ians_india) December 2, 2025
#WATCH | Delhi: On DoT's directions to pre-install Sanchar Saathi App on mobile handsets, Congress MP Renuka Chowdhury says, "They brought in Pegasus and have been unable to keep it under control. MPs and MLAs all say that their phones are being tapped. For the last 11 years,… pic.twitter.com/UT6fVmd5zj
— ANI (@ANI) December 2, 2025