Patna High Court: నితీశ్ సర్కార్‌కు ఊరట.. కులగణనకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patna High Court: దేశంలో జనాభా లెక్కల్లో కులాల వారీగా కుల గణన చేపట్టాలని దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చేపట్టే జన గణనలో కూడా కుల గణనను ప్రత్యేకంగా చేపట్టాలని అన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు కేంద్రానికి వస్తున్నాయి. అయితే గత ఏడాది(2022)లోనే దేశంలో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కులగణననుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బీహార్‌లో ఈ ఏడాది జనవరిలో కుల గణన ప్రారంభమైంది. రెండో విడత సందర్భంగా కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం పాట్నా హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. నితీశ్ సర్కార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణనకు మార్గం సుగమం అయింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బిహార్ ప్రభుత్వం కులగణనను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి దశ సర్వే జనవరి 7-21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది.
Read also: RCF Ltd Recruitment: కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే?
Also Read
మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి వాటిని కొట్టేసింది. అయితే, పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బిహార్‌లో కులగణన చేపట్టనున్నట్లు గతేడాది సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు.
తాజావార్తలు
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!