NTV Telugu Site icon

Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మొత్తం 224 స్థానాల్లో 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 66, జేడీయూ 19 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ రోజు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో బీజేపీయేతర ప్రతిపక్ష నేతల సమక్షంలో సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం జరిగింది.

Read Also: IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్

ఇదిలా ఉంటే చారిత్రాత్మక విజయం సాధించిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఆమె అన్నారు. వీడియో ప్రసంగంలో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అనుకూల, పేదల అనుకూల ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ఈ తీర్పు ద్వారా ప్రజలు అవినీతిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత ఆమె తన సందేశాన్ని ఇచ్చారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, ప్రజలకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను తొలి కాబినెట్ సమావేశంలో ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు గర్విస్తున్నట్లు, కర్ణాటక శ్రేయస్సు, శాంతి, ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.