Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మొత్తం 224 స్థానాల్లో 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 66, జేడీయూ 19 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ రోజు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో బీజేపీయేతర ప్రతిపక్ష నేతల సమక్షంలో సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం జరిగింది.
Read Also: IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్
Also Read
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ఇదిలా ఉంటే చారిత్రాత్మక విజయం సాధించిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఆమె అన్నారు. వీడియో ప్రసంగంలో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అనుకూల, పేదల అనుకూల ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ఈ తీర్పు ద్వారా ప్రజలు అవినీతిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత ఆమె తన సందేశాన్ని ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, ప్రజలకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను తొలి కాబినెట్ సమావేశంలో ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు గర్విస్తున్నట్లు, కర్ణాటక శ్రేయస్సు, శాంతి, ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
#WATCH | Former Congress president Sonia Gandhi thanked the people of Karnataka for electing Congress in the recently concluded assembly elections and assured them that the newly-formed govt will work on the path of development of the state. pic.twitter.com/cvqr76fyFz
— ANI (@ANI) May 20, 2023
తాజావార్తలు
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!