NTV Telugu Site icon

Ram Mandir: రామ మందిర వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదు.. కేంద్రం “నాన్ సెక్యులర్” అంటూ ముస్లిం ప్యానెల్ ఆగ్రహం..

Ram Mandir

Ram Mandir

Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.

ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక వ్యాక్యలు చేసింది. ఈ సంస్థ చైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ కేంద్రం తీరును ఖండించారు. కేంద్రం నాన్ సెక్యులర్ విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇది హిందువుల కార్యక్రమమని..ఇస్లామిక్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొనవద్దని ప్రెస్‌నోట్ రిలీజ్ చేవారు. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలా, జై శ్రీరాం అంటూ నినాదాలు చేయాలా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని.. ఇది న్యాయం, లౌకికవాదాన్ని హత్య చేయడమే అని రహ్మానీ పేర్కొన్నారు.

Read Also: China Manja : ఆర్మీ జవాన్‌ ప్రాణం బలిగొన్న చైనా మాంజా

ఇది బహుదేవతారాధన అని.. ముస్లింలు అర్థం చేసుకోవాలి, ఆలయ నిర్మాణం కోసం హిందూ సోదరులు ఆనందంగా దీపాలు వెలిగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఈ ప్రక్రియలో ముస్లింలు పాల్గొనకూడదని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం మనకు నిర్దేశిస్తోందని.. రాముడితో సహా హిందువుల పవిత్ర వ్యక్తుల్ని మేం గౌరవిస్తాం.. అయినప్పటికీ మేము వారిని దేవుళ్లుగా పరిగణించమని సైఫుల్లా రహ్మానీ చెప్పారు. ముస్లింలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. అది వారి హృదయాలను గాయపరిచింది అని జోడించారు.