NTV Telugu Site icon

Refrigerator Blast: ప్రాణాలు తీస్తున్న ఫ్రిజ్‌లు, గీజర్లు..

Fridge Explotion

Fridge Explotion

Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్‌లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.

 

Read Also: T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు

చెంగల్పట్టు జిల్లా ఊరప్పక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని కోదండరామన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కోదండరామన్ నగర్ లో ఓ ఇంట్లో నివసిస్తున్న గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47) మృతి చెందగా.. ఆరాధయ(6), భారతి(35) గాయపడ్డారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలడంతో ఇంట్లో భారీగా పొగలు రావడంతో ముగ్గురు ఊపిరి ఆడక చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే గుడువంచెరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మండలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ కంప్రెషర్ పేలి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మన సౌకర్యార్థం వాడుకుంటున్న ఎలక్ట్రానిక్ పరికరాలే మన ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో గీజర్ పేలి ఇద్దరు యువ వైద్యులు చనిపోయారు. గీజర్ పేలడంతో పాటు ఆదే సమయంలో కరెంట్ షాక్ గురయ్యాడు భర్త. భర్తను కాపాడే క్రమంలో భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ నిసారుద్దీన్.. ఆయన భార్య ఉమ్మే మొహిమీన్ సైమా చనిపోయారు.

Show comments