తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్‌పట్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ వాహనంపై అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్‌లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.
టమాటా పేరు చెబితే చాలు జనం హడలిపోతున్నారు. టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో టమోటాలు కొనడం మానేశారు జనం. భోజన ప్రియులైతే బిర్యానీలపై పడ్డారు. చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్టిన ఆఫర్ బంపర్ హిట్ అయింది. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. చెన్నై శివార్లలో…