Delhi Car Blast : ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించిన ఆయన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన రాజనాథ్ సింగ్.. “ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన అత్యంత బాధాకరమైంది, కలతపరిచేదిగానూ ఉంది. ఈ అత్యంత విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
Audi Q3 and Q5 Signature Line: మార్కెట్ లోకి ఆడి క్యూ3, క్యూ5 సిగ్నేచర్ లైన్.. ధర ఎంతంటే?
ఘటన తర్వాత వెంటనే భద్రతా విభాగాలు, ఫోరెన్సిక్ టీమ్‌లు ప్రాంతాన్ని ముట్టడి చేసి దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు కారణాలు, ఉగ్రవాద కోణం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. డీటెయిల్స్ కోసం పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం రెడ్ ఫోర్ట్ సమీపంలో ఇటువంటి ఘటన జరగడం భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా ఈ ఘటనపై నివేదిక కోరినట్లు సమాచారం.
Delhi Car Blast Live Updates : 10 మందికి చేరిన మృతుల సంఖ్య.. దేశమంతా హైఅలర్ట్..