Site icon NTV Telugu

Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్

Gujarat Elections

Gujarat Elections

Ravindra Jadeja Thanks PM After Wife Picked As Gujarat BJP Candidate: గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పేరు కూడా ఉంది. దీంతో తమకు అవకాశం కల్పించినందుకు జడేజా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినందుకు నా భార్యకు అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానానికి బీజేపీ తరుపున పోటీలో నిలబడుతోంది.

Read Also: Rishi Sunak: సెమీఫైనల్ మ్యాచ్‌పై జోమాటో ట్వీట్.. రిషి సునాక్‌కి సంకట పరిస్థితి..

రివాబా జడేజా మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. కాంగ్రెస్ సీనియర్ హరి సింగ్ సోలంకికి బంధువు. 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. రాజ్ పుత్ కుటుంబానికి చెందిన రివాబాకు జామ్ నగర్-సౌరాష్ట్ర ఏరియాల్లో మంచి పట్టు ఉంది. కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో ఆమె పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. ఈ జాబితాలో పాటీదార్ ఉద్యమ నాయకుడు హర్దిక్ పటేల్ విరంగమ్ సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. ఘట్లోదియా అసెంబ్లీ స్థానం నుంచి సీఎం భూపేంద్ర పటేల్, మజూరా నుంచి హర్ష్ సంఘవి బరిలోకి దిగనున్నారు.

ఇదిలా ఉంటే టికెట్ల కేటాయింపులో బీజేపీ సంచలన సృష్టించింది. ఇటీవల మోర్బీ జిల్లాలో వంతెన కూలి 140కి పైగా మంది ప్రజలు మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా సాహసాన్ని ప్రశంసిస్తూ బీజేపీ అతనికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఘటన జరిగి సమయంలో కాంతీలాల్ ధైర్యంగా నదిలోకి దూకి పలువురిని కాపాడారు. అయితే ఈ సీటు నుంచి పోటీ చేయాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మోర్జాకు నిరాశ మిగిలింది. దీంతో పాటు మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిఫ్యూటీ సీఎం నితిన్ పటేల్ ఈ సారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు బీజేపీ అధిష్టానికి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు.

Exit mobile version