Site icon NTV Telugu

Ravi Shankar Prasad: మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారు.. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడు..

Ravishankar Prasad

Ravishankar Prasad

Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ ఫలించదని అన్నారు.

Read Also: Valentine Day: బిడ్డా, నీకు లవ్ కావాల్నా.. చెప్పుతో పెళ్లి చేసిన తల్లి

నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్నే నిర్వహించలేకపోతున్నారని.. తనను ప్రధాని అభ్యర్థిగా చేయాలని అందర్ని నితీష్ కుమార్ వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశం మారింది, ప్రజలు మారారు.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారని..నితీష్ కుమార్ రాజకీయ విశ్వసనీయతనను పెంచుకోలేకపోతున్నారని విమర్శించారు. బీహార్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని.. ఆయన పార్టీ గందరగోళంలో ఉంది.. కాంగ్రెస్ ఆయనకు ఏమాత్రం సపోర్టు ఇవ్వడం లేదు.. నితీష్ జీ మీరు దేవేగౌడ, ఐకే గుజ్రాల్ గా మారాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.

గత నెలలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ బీహార్ ను 17 ఏళ్లుగా అభివృద్ధి చేయలేకపోయారని.. ఇందుకు ఆయన సమాధాన్ యాత్రే సమాధానం అని అన్నారు. గతంలో కేసీఆర్ బీహార్ కు వచ్చినప్పుడున తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నితీష్ అనుకున్నారని.. అలాగే కేసీఆర్ కూడా అనుకున్నారని సెటైర్లు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కాంగ్రెస్ తో కలిసినా ప్రయోజనం లేదని అన్నారు.

Exit mobile version