Ranchi: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో తబారక్ లాడ్జ్, హోటల్ పేరుతో నడుస్తోంది. అయితే, ఈ లాడ్జ్ గదుల్లో ఓ యువకుడు మాత్రం నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు బాంబులు అందించేందుకు, గదినే బాంబుల తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగాలకు, ఎస్ఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకుంటున్న అషర్ డానిష్ అనే వ్యక్తి, ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తున్నాడు. గత వారం ఢిల్లీ పోలీసుల మరో ఉగ్రవాది అఫ్తాబ్ ఖురేషిని అరెస్ట్ చేసి, విచారణ చేయగా డానిష్ గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం మేరకు, డానిష్, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.
Read Also: Pawan Kalyan Vs Bonda Uma: పవన్ కల్యాణ్ వర్సెస్ బోండా ఉమా..! సీఎం సీరియస్
బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. డానిష్ గది నుంచి గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకునున్నారు. ఈ గదిలో బాంబుల్ని తయారు చేసి, సువర్ణ రేఖ నదిలో వీటిని పేల్చి పరీక్షించినట్లు తేలింది. గదిలో వివిధ మొత్తాల్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ గది కేవలం బాంబుల తయారీ కర్మాగారం మాత్రమే కాకుండా, టెర్రరిస్టులు తమ రిక్రూట్‌మెంట్‌ల కోసం వాడుకుంటున్నట్లు తేలింది. రిక్రూట్మెంట్ల కోసం సిగ్నల్ మెసేజింగ్ యాప్ వాడుకుంటున్నట్లు తేలింది. బాంబుల తయారీకి కావాల్సిన నిధుల్ని సేకరించడానికి దీనిని వాడుకున్నారు. అమెజాన్ నుంచి కత్తులు, రసాయనాలు ఆర్డర్ చేసినట్లు తేలింది. డానిష్‌కు పాకిస్తాన్ హ్యండ్లర్ పెంటాఎరిథ్రిటోల్ టెట్రానైట్రేట్ బాంబుల(PETN) ఎలా తయారు చేయాలో నేర్పించాడు. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లో సుఫియాన్ ఖాన్, మొహమ్మద్ హుజైఫ్ యమన్, కమ్రాన్ ఖుషేరీ సభ్యులుగా ఉన్నారు. వీరు మతపరమైన ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.