Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: 2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం

Ram Mandir

Ram Mandir

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 21, 22, 23 వరకు కార్యక్రమాల జరుగనున్నాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. సాధువులు, ఇతర ప్రముఖులను సైతం ఈ వేడకకు ఆహ్వానిస్తామని రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.

Health Tips : బేబీ కార్న్ ను ఇలా తీసుకుంటే చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని చంపత్ రాయ్ తెలిపారు. అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి వేదిక లేదా బహిరంగ సభ ఉండవని స్పష్టం చేశారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దల్ని ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోందన్నారు. ఆ జాబితా సిద్ధమైన తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన పత్రాన్ని పంపించనున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు.

Samuthirakani : ఆ ఇద్దరి స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ దర్శకుడు..

అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిథులు విడివిడిగా ఉంటారని చెప్పారు. వీరంతా రామజన్మభూమి ప్రాంగణంలోని పవిత్రోత్సవానికి హాజరవుతారన్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల కారణంగా ఆలయానికి భూమి పూజ కార్యక్రమం ఆగస్ట్ 5, 2020న చాలా చిన్నగా జరిగిందన్నారు. రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందన్నారు. మరోవైపు ఈ వేడుకలను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది.

Exit mobile version