దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకవైపు దర్శకుడి గా అద్భుతమైన సినిమాల ను తెరకెక్కిస్తూనే మరొకవైపు విలక్షణ నటుడిగా సినిమా అవకాశాలను అందుకుంటూ అదరగొడుతున్నాడు సముద్రఖని.ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా ను తెరకెక్కించాడు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సముద్రఖని రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లపై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్‌తో కలిసి నేను ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించాను. నన్ను బాబాయ్ అని తాను పిలిచేవాడు.మేమిద్దరం ఆ సినిమా సమయం లో మంచి స్నేహితులం అయ్యాము.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా లో కూడా నా పాత్ర రామ్ చరణ్ పాత్రకు ఎంతో సన్నిహితంగా ఉంటుంది.చరణ్ కు ఎలాంటి కష్టం కలుగకూడదని నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను అని తెలిపారు సముద్రఖని. ఆ తరువాత అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అలా వైకుంఠపురం సినిమా లో అల్లు అర్జున్ తో కలిసి నటించాను. నేను తనని అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం.ఆయన అందరితో ఎంతో ప్రేమగా ఉంటాడు. షూటింగ్ సమయం లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. అల్లు అర్జున్ మంచి మనసున్న వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో పుష్ప 2 సినిమా లో నటిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.