Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajnath Singh Talks About India China Clash At Tawang In Parliament

Rajnath Singh: ఎలాంటి అతిక్రమణలనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉంది

Published Date :December 13, 2022 , 1:23 pm
By NTV WebDesk
Rajnath Singh: ఎలాంటి అతిక్రమణలనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajnath Singh Talks About India China Clash At Tawang In Parliament: ఈనెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడారు. తవాంగ్‌లోని యాంగ్‌త్సే ప్రాంతంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని అన్నారు. అయితే.. వారిని మన రక్షణ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని, ఈ ఘర్షణలో మన భారతీయ సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉందని, చైనా దళాల ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదురించాయని పేర్కొన్నారు. మన దేశ భూభాగంలోకి చొరబడకుండా వాళ్లని నిలువరించారన్నారు.

Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి

ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని.. భారత సైన్యంతో పోలిస్తే, చైనా సైనికులే ఎక్కువమంది గాయపడ్డారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారతీయ సైనికుల్లో ఏ ఒక్కరూ కూడా తీవ్రంగా గాయపడటం గానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని.. పీఎల్ఏ సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా, తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు మన భారత సైన్యం నిబద్ధతతో కట్టుబడి ఉందని.. ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి.. చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ దాడిలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై ఎగబడ్డారని.. అందుకు భారత సైనికులు ధీటుగానే బదులిచ్చారని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు స్పల్పంగా గాయపడగా.. గాయపడ్డ భారత సైనికుల్ని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించామని తెలిపింది.

Cold: జలుబు వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో మటుమాయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India China Clash
  • Indian Army
  • Parliament Winter Session
  • Rajnath Singh
  • Tawang Face Off

తాజావార్తలు

  • AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!

  • KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions