NTV Telugu Site icon

Rajnath singh: బీజేపీని గెలిపిస్తే.. జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం

Rajnathsing

Rajnathsing

దేశంలో దీపావళి ముగిసింది. కానీ జార్ఖండ్‌లో మాత్రం పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం ప్రధాని మోడీ.. హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విరుచుకుపడగా.. మంగళవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ మాత్రం.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి..

జార్ఖండ్‌లో బీజేపీని గెలిపిస్తే.. సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామన్నారు. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుందని విమర్శించారు. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా హేమంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నానన్నారు. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించారు. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్‌ను నిలబెడతామని హామీ ఇచ్చారు. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారం కోసం హేమంత్ సర్కార్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి తహతహలాడుతోంది.

ఇది కూడా చదవండి: Omar Abdullah: వాజ్‌పేయి బతికి ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌కి ఈ సమస్య వచ్చేది కాదు..