Site icon NTV Telugu

Rajiv Gandhi assassination: “మా నాన్నను ఎందుకు చంపారు”.. ప్రియాంకాగాంధీ ఏడ్చారన్న నళిని

Rajiv Gandhi Assassination Case

Rajiv Gandhi Assassination Case

Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తనను జైలులో కలిశారని.. నా తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారని నళిని తెలిపారు. జైలులో కలిసిన సమయంలో నన్ను కలిసిన సమయంలో భావోద్వేగంతో ఏడ్చేశారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య గురించి తనను ప్రియాంకాగాంధీ ప్రశ్నించినట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే.. ఈ ఏడాది మేలో ఏజీ పెరివాలన్ ను సుప్రీంకోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. తాజాగా ఇదే సూత్రాన్ని మిగతా ఆరుగురు నిందితులకు వర్తింప చేస్తూ 30 ఏళ్ల తరువాత ఈ కేసు నుంచి ఆరుగురికి విముక్తిని ప్రసాదించింది.

Read Also: Gold Smuggling: ముంబై విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం.. బెల్టులో అమర్చి తరలించే యత్నం

నిందితుల్లో నళిని భర్త శ్రీహరన్ కూడా ఉన్నారు. ఆయన శ్రీలంక జాతీయుడు కావడంతో తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. త్వరలోనే తన భర్తను కలుస్తున్నట్లు నళిని వెల్లడించారు. తమిళనాడులోని పలు ప్రదేశాలకు వెళ్లాలని తాను అనుకుంటున్నట్లు నళిని వెల్లడించారు. ఈ కేసులో తనకు సహకరించిన అందర్ని కలవాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు గాంధీ కుటుంబీకులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.

జైలులో ఉన్న సమయంలో మమ్మల్ని మరణశిక్ష ఖైదీలుగా చూసేవరాని.. తాను అరెస్ట్ అయ్యే సమయానికి గర్భవతిని అయినప్పటికీ..జైలులో బంధించారని నళిని అన్నారు. నా జీవితం ఇప్పటికే నాశనం అయిందని..కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నళినితో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, ఎస్ రాజా, శ్రీహరన్ దోషులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పర్యటనకు రాజీవ్ గాంధీ వచ్చిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) గ్రూప్‌కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆయన్ను హత్య చేసింది.

Exit mobile version