Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..
- ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ..కత్తితో దాడి..
- రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మతహింస..
- నగరంలో భారీగా బందోబస్తు.. ఇంటర్నెట్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అట్టుడుకుతోంది. మతహింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది. నగరంలో మత ఘర్షణల కారణంగా శుక్రవారం ఉదయ్‌పూర్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ గుంపు రాళ్లు రువ్వి మూడు నాలుగు కార్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని బాపూ బజార్, హతిపోల్, ఘంటా ఘర్, చేతక్ సర్కిల్ మరియు సమీప ప్రాంతాలలో మార్కెట్లు మూసివేయబడ్డాయి. షాపింగ్ మాల్‌లపై కూడా రాళ్ల దాడి జరిగింది.
Read Also: Lucknow: లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థం లీక్.. ఖాళీ చేయించిన అధికారులు
Also Read
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ఉదయ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలతో 10 తరగతి విద్యార్థి అతని సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో దాడి చేసిన బాలుడు ముస్లిం వర్గానికి చెందడం, గాయపడిన విద్యార్థి హిందూ వర్గానికి చెందడంతో నగరంలో మత హింసను ప్రేరేపించింది. ఈ ఘటనపై ఉదయ్‌పూర్ కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ.. ఇద్దరి పిల్లల మధ్య జరిగిన గొడవ గురించి మాకు సమాచారం అందిందని, గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.
ఈ సంఘటన తర్వాత కొన్ని హిందూ సంస్థల సభ్యులు నిరసనగా నగరంలోని మధుబన్ వద్ద గుమిగూడారు, ఇది ఆ తర్వాత హింసాత్మక పరిణామాలకు దారి తీసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మోహరించబడింది. డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్, కలెక్టర్ అరవింద్ పోస్వాల్, ఎస్పీ యోగేష్ గోయల్, రాజ్యసభ ఎంపీ చున్నీలాల్ గరాసియా, లోక్‌సభ ఎంపీ మన్నాలాల్ రావత్, ఎమ్మెల్యేలు తారాచంద్ జైన్, ఫూల్ సింగ్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిపై సమావేశం నిర్వహించారు.
తాజావార్తలు
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!