Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
- రాజస్థాన్‌లో ఇంటర్ ఫలితాలు విడుదల
- 93.88 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచిన నికిత
- 10 రోజుల క్రితమే తుది శ్వాస విడిచిన నికిత
- తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో నికిత అనే బాలిక 93.88 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. కానీ ఈ విజయాన్ని చూడడానికి ఆమె భూమ్మీద లేకపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నికిత మరణం వెనుక ఉన్న అంతులేని గాథ కన్నీళ్లు రప్పిస్తున్నాయి.
నికిత శ్రీగంగానగర్ ప్రాంతానికి చెందిన వాసి. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయితేనేమీ చదువులో మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి. శ్రీగంగానగర్‌లోని 7 కేఎన్ రావల్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు అయినప్పటికీ చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అయితే నికిత గత కొద్దిరోజులుగా హెపటైటిస్, మధుమేహంతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధులు తీవ్రం కావడంతో 10 రోజుల క్రితం (మార్చి 20, 2026) ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబంలో.. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read
తాజాగా మంగళవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నికిత 93.88 శాతం మార్కులతో విజయం సాధించింది. ఫలితాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమార్తెను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాష్ట్రమంతటా తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతే.. నికిత తల్లిదండ్రులు మాత్రం దు:ఖంలో మునిగిపోయారు. ఈ పరిణామం పలువురిని కంటతడి పెట్టించాయి. వ్యాధులు బాధించినా చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డు పరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..8 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అమ్మాయిలు టాప్‌గా నిలిచారు. 96.42 శాతంతో బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులు కాగా.. 92.64 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.
ఇది కూడా చదవండి: Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!
తాజావార్తలు
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!