PM Modi: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలపై పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్‌ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు, గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు…