Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, మరాఠీ ప్రజలపై హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వీరిద్దరిని, హిందీ వ్యతిరేకత కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
‘ఆవాజ్ మరాఠీ చా’ (మరాఠీ స్వరం) విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి రాజ్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్ర రాజకీయాలు, పోరాటాల కన్నా గొప్పడది. నేడు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్, నేను కలిసి వచ్చాము. మా ఇద్దరి కలిపేందుకు బాలాసాహెబ్ ఠాక్రే చేయలేనిది, దేవేంద్ర ఫడ్నవీస్ చేశారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలతో సహా ముంబై పౌర సంస్థకు జరిగే ఎన్నికల్లో తాము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని, మేము కలిసి ఉండటానికి కలిసి వచ్చాము అని ఉద్ధవ్ అన్నారు.
Read Also: Uddhav Thackeray: అవును మేము గుండాలమే, మా “గుండాయిజం” చూస్తూనే ఉంటారు..
చివరిసారిగా వీరిద్దరు 2005 ఎన్నికల సమయంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చి, 2006లో ఎంఎన్ఎస్ పార్టీని ప్రారంభించారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, శివసేన(యూబీటీ)కి 20 సీట్లు రాగా, ఎంఎన్ఎస్ ఒక్కసీటు కూడా గెలవలేకుండా పోయింది. అయితే, హిందీని మూడో భాషగా చేస్తూ ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీ భాష వీరిద్దరిని కలిపింది.
త్రిభాషా సూత్రంపై ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళిక చేస్తున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నాకు హిందీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు, ఏ భాష కూడా చెడ్డది కాదు. వారు మాపై హిందీని రుద్దే ప్రయోగంతో ప్రారంభించారు. మనం దానిని వ్యతిరేకించకపోతే, వారు ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేసేవారు’’ అని ఆరోపించారు.
బీజేపీ నేత ఎల్కే అద్వానీ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడని, ఆయన హిందుత్వం గురించి ఎవరూ ఎలాంటి సందేహాలు లేవనెత్తలేదని చెప్పాడు. ‘‘మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో నేర్చుకున్నారని వారు అంటున్నారు. ఫడ్నవీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. నా తండ్రి శ్రీకాంత్ థాకరే, అంకుల్ బాలాసాహెబ్ థాకరే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. మరాఠీ పట్ల వారికున్న ప్రేమ గురించి ఎవరైనా ప్రశ్నించగలరా? రేపు నేను హిబ్రూ కూడా నేర్చుకుంటాను. మరాఠీ పట్ల నాకున్న గర్వం గురించి ఎవరైనా ప్రశ్నించగలరా?’’ అని రాజ్ ఠాక్రే అడిగారు.