NTV Telugu Site icon

Rahul Gandhi: అమరావతిలో రాహుల్ గాంధీ బ్యాగ్స్ చెక్ చేసిన ఈసీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఈ చెకింగ్ జరిగాయి.

Read Also: Rajasthan:పెళ్లైన 10 నెలలకే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. కారణం?AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా

జార్ఖండ్ రాష్ట్రంలో శుక్రవారం రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన హెలికాప్టర్ టేకాఫ్ కాకుండా చాలా ఆలస్యం చేసినందుకు కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంక్షల కారణంగా గాంధీ హెలికాప్టర్‌ను టేకాఫ్‌కు అనుమతించడం లేదని, దీంతో ఆయన బహిరంగ సభలు ఆలస్యమవుతాయని లేదా రద్దయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.

అయితే, ఈ బ్యాగుల తనిఖీలు మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగా మారాయి. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, బీజేపీ నాయకులకు సంబంధించిన బ్యాగుల్ని ఇలాగే తనిఖీ చేస్తారా..? అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ ఈ తనిఖీలను సమర్థించింది. గత కొన్ని రోజుల క్రితం ఈసీ బీజేపీ నేతలైన నితిన్ గడ్కరీ, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, ఎన్డీయే మిత్రపక్షం అజిత్ పవార్ బ్యాగుల్ని తనిఖీ చేసిన వీడియోలను షేర్ చేసింది.