Site icon NTV Telugu

BJP: కాంగ్రెస్‌లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..

Bjp

Bjp

BJP: భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎదురుదాడి ప్రారంభించింది. ‘‘కాంగ్రెస్ రాజ్యంలో రాహుల్ గాంధీ తెలివైన మూర్ఖుడు’’గా అభివర్ణించింది.

Read Also: Rahul Gandhi: అమెరికాతో డీల్ సిగ్గుచేటు.. దేశాన్ని అమ్మేశారన్న రాహుల్‌గాంధీ

లోక్‌సభ సమావేశాలు ముగిసిన తర్వాత విలేకరులతో బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంషు త్రివేది మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడి రాజకీయ ప్రసంగం పార్లమెంటరీ మర్యాద ప్రమాణాలను తగ్గించాయని ఆరోపించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ పదే పదే అసంబద్ధ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. “పార్లమెంట్ చాలా కాలంగా అత్యున్నత ప్రజాస్వామ్య ప్రమాణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రవర్తన, భాష, వ్యవహార శైలి ద్వారా, రాజకీయాలను, పార్లమెంటరీ మర్యాదను దిగజార్చాయి” అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ తీవ్ర నిరాశతో ఇలాంటి వ్యాక్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగం అసూయతో నిండిపోయిందని త్రివేది దుయ్యబట్టారు. సభలో వీధి స్థాయి భాష, ప్రవర్తన చూడాలనుకుంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను చూస్తే తెలుస్తుందని అన్నారు.

Exit mobile version