Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ డ్యాన్స్‌తో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ ప్రజంట్ కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికి హిట్‌లు మాత్రం పడటంలేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయింది. అంతే కాదు ఈ ఫేల్యూర్ ఎఫేక్ట్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదనే పడింది.
Also Read : Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ఇటీవల శ్రీ లీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం (సుమారు 150 కోట్లు) జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పుడు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ, పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం.
తెలుగులో ఆమె చేసిన ‘జూనియర్’, ‘రాబిన్‌హుడ్’ వంటి సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీ లీల, కోలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా తగిలిన ఫ్లాపులు ఒక కారణమైతే, కోలీవుడ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా నటిస్తోంది. మరి ఈ పారితోషికం తగ్గింపు శ్రీలీల కెరీర్‌కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!