Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు

  • మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
  • 12 ఏళ్ల పాలనతో ప్రజలకు ఇక్కట్లు
  • ముఖేష్, అదానీ బాగుపడ్డారని విమర్శలు
Rahulgandhi

Rahulgandhi

ప్రధాని మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా మోడీ తీసుకున్న నిర్ణయాల ప్రభావం అంబానీ, అదానీ కాకుండా రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రజల సమస్యలను ప్రధాని పట్టించుకోకపోతే దేశం పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ముఖేష్ అంబానీపై కూడా విమర్శల దాడి చేశారు. ‘‘అంబానీ వేల కోట్ల రూపాయల విలువైన చమురును ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. కానీ మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.’’అని విమర్శించారు. ఇక అదానీపై అమెరికాలో ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

సాధారణ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. కానీ ప్రజలు తినడానికే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటప్పుడు ఎలా కొంటారని ధ్వజమెత్తారు. దేశంలో గ్యాస్ కొరత కూడా నెలకొందని ఆరోపించారు. ఇక ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘మోడీ రిమోట్ కంట్రోల్ అమెరికాలో ఉంది. ఆయన ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లినా క్షమాపణలు కోరుతూనే ఉంటారు.’’ అంటూ వ్యాఖ్యానించారు.