Site icon NTV Telugu

Rahul Gandhi: ఓటర్ల జాబితాపై అన్ని అనుమానాలే.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగాలి

Rahulgandhi

Rahulgandhi

దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షం చర్చ నిర్వహించాలని కోరుకుంటుందని తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాపై చర్చ జరగాలన్నారు. మొత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: PGCIL: పరీక్ష లేకుండా పవర్‌గ్రిడ్ లో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు 2.2 లక్షల జీతం

గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన మాజీ కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా ఇదే అంశంపై లోక్‌‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

సోమవారం (మార్చి10) నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Kerala: స్లిమ్ గా మారడానికి.. ఆన్‌లైన్‌ డైట్ పాటించిన యువతి.. చివరకు

 

Exit mobile version