Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- అంబానీని టార్గెట్ చేస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్..
- మరో వ్యక్తి ఉన్నారంటూ రాహుల్ గాంధీ రిఫ్లై..
- రాజకీయ సంచలనంగా మారిన మస్క్ వరస వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత్‌లో తన స్టార్‌లింక్ అనుమతులకు జాప్యం ఏర్పడుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపనలు చేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా..‘‘భారత్‌కు నిజమైన బాస్ అంబానీనా?’’ అంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘వెల్కమ్ టూ ఇండియా ఎలాన్, మరొక వ్యక్తి ఎవరో తెలిసే వరకు వేచి చూడండి’’ అంటూ కామెంట్ చేశారు.
అయితే, ఆ మరో వ్యక్తి ఎవరనేది రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు గౌతమ్ అదానీని ఉద్దేశించినవని చాలా మంది అనుకుంటున్నారు. చాలాసార్లు రాహుల్ గాంధీ అంబానీ, అదానీలను టార్గెట్ చేస్తూ విమర్శించారు. అదానీకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ గతంలో పలుమార్లు ఆరోపించింది.
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘థాంక్యూ రాహుల్. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అని రిప్లై ఇచ్చారు. దీనికి ముందు ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు రావడంపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంస్థ 165కిపైగా దేశాల్లో లైసెన్స్ పొందిందని, భారత్‌లోని చట్టాలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఐదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ‘‘అంబానీయే భారత్‌కు అసలైన బాస్నా?’’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు.
దీనికి ముందు మరో పోస్టులో భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొంతమంది ‘‘ఒలిగార్కుల’’ అడ్డుకుంటున్నారని, తమ గుత్తాధిపత్య ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. అయితే, మస్క్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల అనుమతుల వ్యవస్థ న్యాయమైందని, వివక్ష లేదని స్పష్టం చేసింది. భారత్ స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియో యొక్క శాటిలైట్ వెంచర్ జియో సాట్కామ్ మరియు భారతి మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్‌లకు లైసెన్సులు మంజూరు చేసింది. అయితే, వీటికి అవసరమైన భద్రతా అంచనాలు, స్పెక్ట్రమ్ ఆమోదాలు పూర్తయ్యే వరకు వాణిజ్య సేవలు ప్రారంభించలేవు.
Thank you, Rahul.
This is indeed troubling.
— Elon Musk (@elonmusk) October 8, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!