Rahul Gandhi : మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపిస్తున్నారు.. 850 సీట్లు ఎందుకు?
- 850 సీట్లపై రాహుల్ ప్రశ్నలు
- మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
- ఓట్ల దొంగతనంపై ఆరోపణలు
- త్వరలో జ్ఞానేష్ కుమార్ వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో దేశ ఎన్నికల స్వరూపాన్ని మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శనివారం (నవంబర్ 28) న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయనే విషయం దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైందని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్లు రేపే అమలు చేయొచ్చు..
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ప్రభుత్వం తలుచుకుంటే మహిళా రిజర్వేషన్లను రేపే అమలు చేయవచ్చని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపిస్తూ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే అస్సాం, జమ్మూకశ్మీర్‌లో జరిగిన పరిణామాలను పరిశీలించాలన్నారు. సీట్ల సంఖ్యను 850కి పెంచడం ద్వారా దేశ ఎన్నికల పటాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
- Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం..
- Mallikarjun Kharge : రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..
- Italy Govt: పాఠశాలలో బురఖా, నిఖాబ్ నిషేధం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..
ఓట్ల దొంగతనంపై సంచలన ఆరోపణలు
ఎన్నికల్లో అవకతవకలకు సంబంధించి తమ వద్ద ఉన్న సర్వే వివరాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తమ సర్వే ప్రకారం దేశంలోని 80 శాతం మంది ప్రజలు, దాదాపు 100 శాతం మంది జెన్ జెడ్ తరం యువత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని, అందుకే ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకొచ్చారని ఆరోపించారు.
2024 ఎన్నికల చెల్లుబాటుపై ప్రశ్నలు
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసేందుకు అర్హత లేని 14 కోట్ల మంది గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారని ఎన్నికల సంఘమే చెబుతోందని ఆయన పేర్కొన్నారు. అదే నిజమైతే ఎన్నికల సంఘం వాదన ప్రకారమే 2024 ఎన్నికల చెల్లుబాటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.
జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చారని, బీహార్‌లో ఓటర్ల పేర్లను ఎలా తొలగించారో ఇప్పటికే బయటపెట్టామని తెలిపారు. అస్సాంలో బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాలను మార్చారని, పశ్చిమ బెంగాల్లో 100కు పైగా సీట్లను అక్రమంగా గెలుచుకున్నారని ఆరోపించారు.
జ్ఞానేష్ కుమార్‌పై త్వరలో మరిన్ని వివరాలు
ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్‌లను తాము ఉచ్చులో పడేశామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ విషయం వారికీ తెలుసన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు సంబంధించి తమ వద్ద పెద్దఎత్తున సమాచారం ఉందని, త్వరలోనే ఆ వివరాలను ప్రజల ముందుంచుతామని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహం, దాని వెనుక ఉద్దేశాలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు వివరిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
-
OTR: పనితీరు బాగుంటేనే టికెట్.. రెండోసారి గెలుపు కోసం రేవంత్ కసరత్తు..!
-
Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్… వైరల్ అవుతున్న చెక్!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!