NTV Telugu Site icon

Rahul vs Modi: లోక్‌సభలో రాహుల్‌ స్పీచ్.. పదే పదే మోడీ, బీజేపీ ఎంపీల అభ్యంతరం

Rae

Rae

లోక్‌సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సమావేశం అంతా హాట్ హాట్‌గా సాగింది. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని రాహుల్ ఆరోపించారు. అందులో తానూ బాధితుడినేనని.. తనపై కూడా 20కిపైగా కేసులు మోపారని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..

తనకు రెండేళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అలాగే ఇల్లు కూడా తీసేసుకున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నట్లు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. అయితే రాహుల్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ సహా బీజేపీ ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలిపారు.

ఇది కూడా చదవండి: Maharashtra Video: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు

ఇక ప్రసంగం మధ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కలగజేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ తెలిపారు.