Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
- పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సంభాషణ
- రాహుల్ గాంధీ గదికి వెళ్లిన కేంద్రమంత్రి
- 5 నిమిషాల పాటు సరదా సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం ఎంత హాట్ హాట్‌గా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక బుధవారం సభలో రాహుల్ గాంధీ చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని వాయిదా పడింది. అయితే కొద్దిసేపటికే పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ-కిరణ్ రిజిజు సరదాగా ముచ్చటించుకుంటున్నారు. సభలోనేమో ఫైటింగ్.. బయట ముచ్చట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read
బుధవారం లోక్‌సభ వాయిదా పడ్డాక రాహుల్ గాంధీ-కిరణ్ రిజిజు పార్లమెంట్ భవనంలో కలుసుకున్నారు. రాహుల్ గాంధీ.. కిరణ్ రిజిజు చేయి పట్టుకుని తన గదికి ఎప్పుడైనా వచ్చారా? అని అడిగారు. దీంతో రిజిజు రాలేదని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ నవ్వి… ‘ఈరోజు నా గదికి వెళ్దాం’ అంటూ తీసుకెళ్లారు. పార్లమెంట్‌లోని జీ-41 గదికి వెళ్లారు. దాదాపు 5 నిమిషాల పాటు కిరణ్ రిజిజు గడిపారు. ఈ సమయంలో ఇద్దరు నాయకులు ఫొటోలకు పోజులిచ్చారు. రాహుల్ గాంధీ గదిలో కైలాస్ మానసరోవర్ చిత్రం వేలాడదీసి ఉంది. రాహుల్.. రిజిజుతో ‘‘రా.. ఈ చిత్రం ముందు ఒక ఫొటో తీసుకుందాం’’ అంటూ పిలిచారు. దీంతో ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు.
ఇద్దరు నాయకులు పార్లమెంటరీ ప్రతిష్టంభన గురించి గానీ, మరే ఇతర రాజకీయ అంశం గురించి గానీ చర్చించలేదు. ఇద్దరూ అనధికారిక సంభాషణలో నిమగ్నమవ్వడంతో ఈ సమావేశం ఆహ్లాదకరంగా జరిగింది. ఇక రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజులు ఇలాంటి ఆత్మీయ సంభాషణ జరుపుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ దాడి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక స్మారక సభలో కూడా ఇద్దరు నాయకులు సరదాగా మాట్లాడుకున్నారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ టీ-షర్టు ధరించి ఉండటంతో ఆయన ఫిట్‌నెస్‌పై రిజిజు సరదాగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
-
Asian Legends League: ప్రారంభమైన లెజెండ్స్ టీ20 లీగ్.. ఆగస్టు 2న హై ఓల్టేజ్ మ్యాచ్..
-
LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్‌బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి.!
ట్రెండింగ్
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!